విండీస్‌పై శ్రీలంక క్లీన్‌స్వీప్

ABN , First Publish Date - 2021-12-04T08:44:27+05:30 IST

స్పిన్నర్లు ఎంబుల్డేనియా (5/35), రమేశ్‌ మెండిస్‌ (5/66) తిప్పేయడంతో వెస్టిండీ్‌సతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 164 పరుగులతో విజయం సాధించింది.

విండీస్‌పై శ్రీలంక క్లీన్‌స్వీప్

గాలె: స్పిన్నర్లు ఎంబుల్డేనియా (5/35), రమేశ్‌ మెండిస్‌ (5/66) తిప్పేయడంతో వెస్టిండీ్‌సతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 164 పరుగులతో విజయం సాధించింది. 297 పరుగుల విజయ లక్ష్యంతో ఆఖరిరోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ 132 రన్స్‌కే కుప్పకూలింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 328/8తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక 345 రన్స్‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 204, విండీస్‌ 253 రన్స్‌ చేశాయి. తొలి టెస్ట్‌లో లంక నెగ్గింది. 

Updated Date - 2021-12-04T08:44:27+05:30 IST