సోమవారం నుంచి ట్రైనింగ్ ప్రారంభించనున్న శ్రీలంక ఆటగాళ్లు

ABN , First Publish Date - 2020-05-31T20:59:04+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి నెల నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్నీ క్రీడా టోర్నమెంట్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే పటిష్టమైన నియమ

సోమవారం నుంచి ట్రైనింగ్ ప్రారంభించనున్న శ్రీలంక ఆటగాళ్లు

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి నెల నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్నీ క్రీడా టోర్నమెంట్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే పటిష్టమైన నియమ నిబంధనల మధ్య శ్రీలంక క్రికెటర్లు సోమవారం నుంచి తిరిగి క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. కొలంబో క్రికెట్ క్లబ్‌లో 12 రోజుల క్యాంపులో 13 మంది ఆటగాళ్లు పాల్గొంటారని శ్రీలంక క్రికెట్(ఎస్‌ఎల్‌సీ) ప్రకటన విడుదల చేసింది. 


‘‘మూడు ఫార్మాట్లలో కలిపి ఆటగాళ్లని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఎక్కువ శాతం బౌలర్లే. పోటీలో పాల్గొనే ముందు వారికి మరింత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది’’ అని ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే క్యాంపు నిర్వహిస్తున్నామని ఎస్‌ఎస్‌సీ పేర్కొంది. ఆటగాళ్లను పరిశీలించేందుకు నలుగురు సిబ్బంది ఉంటారని.. క్యాంపు ముగిసేవరకూ ఆటగాళ్లు హోటల్, ప్రాక్టీస్ వేదిక విడిచి బయటకు వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-05-31T20:59:04+05:30 IST