Abn logo
Jan 26 2021 @ 03:10AM

మౌమా, సుధకు పద్మ శ్రీ

న్యూఢిల్లీ: వెటరన్‌ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మౌమా దాస్‌ (బెంగాల్‌), స్టీపుల్‌చేజ్‌ అథ్లెట్‌ సుధా సింగ్‌ (యూపీ)తోపాటు మరో ఐదుగురు క్రీడాకారులను ప్రతిష్ఠాత్మక పౌర  పురస్కారం ‘పద్మశ్రీ’ వరించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి పి. అనిత (తమిళనాడు), పర్వతారోహకురాలు అన్షు జమ్‌సేన్‌పా (అరుణాచల్‌), రెజ్లర్‌ వీరేందర్‌ సింగ్‌ (హరియాణా), పారా అథ్లెట్‌ కేవై వెంకటేష్‌ (కర్ణాటక)తోపాటు అథ్లెటిక్స్‌ కోచ్‌ మాధవన్‌ నంబియార్‌ (కేరళ) కూడా క్రీడాకారుల విభాగంలో ‘పద్మ శ్రీ’కి ఎంపికయ్యారు. నంబియార్‌ దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష కోచ్‌.

Advertisement
Advertisement
Advertisement