నేడు జింబాబ్వేతో రెండో వన్డే

ABN , First Publish Date - 2022-08-20T12:15:53+05:30 IST

నేడు జింబాబ్వేతో రెండో వన్డే

నేడు జింబాబ్వేతో రెండో వన్డే

సిరీస్‌ వేటలో భారత జట్టు

మధ్నాహ్నం 12.45 నుంచి సోనీ సిక్స్‌లో..


హరారే: తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో జింబాబ్వేను చావుదెబ్బ తీసిన టీమిండియా ఇప్పుడు సిరీ్‌సపై దృష్టి సారించింది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరుగనుంది. దీంట్లోనూ విజయం సాధించి మరో మ్యాచ్‌ ఉండగానే రాహుల్‌ సేన సిరీ్‌సను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. మరోవైపు బంగ్లాదేశ్‌పై టీ20, వన్డే సిరీ్‌సలను గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపించిన జింబాబ్వే జట్టు భారత్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా తడబడింది. గత మ్యాచ్‌లో టెయిలెండర్ల పోరాటం లేకపోతే ఆ జట్టు స్కోరు మరీ దారుణంగా ఉండేది. ఇక బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం వారి పేలవ ప్రదర్శనను బహిర్గతం చేసింది. సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండేందుకు ఎలాగైనా ఈ మ్యాచ్‌ను దక్కించుకోవాలని జింబాబ్వే తహతహలాడుతోంది.


బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం..తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకపోవడంతో ఇతరులకు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ముఖ్యంగా గాయాలతో కొంతకాలంగా క్రికెట్‌కు దూరమైన కెప్టెన్‌ రాహుల్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అత్యవసరం. రానున్న ఆసియాక్‌పలో అతడి ఫామ్‌ కీలకం కానుంది. అందుకే టాస్‌ గెలిస్తే ముందుగా బ్యాటింగ్‌కు దిగడం ఉత్తమం. ఓపెనర్లు ధవన్‌, గిల్‌ ఫామ్‌ దుర్బేధ్యంగా ఉంటోంది. ఇద్దరూ ఆడిన నాలుగు వన్డేల్లో మూడు శతక భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం. జట్టుకు వీరి ద్వారా శుభారంభాలు అందుతున్నాయి.


ఇషాన్‌ ఇటీవల ఆడిన టీ20ల్లో పేలవ ఫామ్‌ కనబరిచాడు. దీంతో అతడు కూడా క్రీజులో నిలవాలనుకుంటున్నాడు. అలాగే దీపక్‌ హుడా, శాంసన్‌ల బ్యాటింగ్‌ తీరు కూడా పరిశీలించాల్సి ఉంది. బౌలింగ్‌లో పేస్‌ త్రయం దీపక్‌చాహర్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ చెలరేగి 7 వికెట్లు సాధించారు. ముఖ్యంగా చాహర్‌ వరుసగా 7 ఓవర్లు వేసి వన్డేలు కూడా ఆడగలనని నిరూపించుకున్నాడు. అలాగే పవర్‌ప్లేలో వికెట్లను తీస్తూ పరుగులను కట్టడి చేశాడు. స్పిన్నర్‌ అక్షర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్‌ యాదవ్‌ పరుగులను నియంత్రించగలిగాడు. కానీ లోయరార్డర్‌ను త్వరగా కట్టడి చేయలేకపోవడం బౌలర్ల బలహీనతగా చెప్పవచ్చు.టాపార్డర్‌ రాణిస్తేనే..జింబాబ్వే ఈ సిరీ్‌సకు అంచనాలతోనే బరిలోకి దిగింది. అయితే టాపార్డర్‌ విఫలం కావడం ఆ జట్టు స్కోరుపై ప్రభావం పడుతోంది. ఇటీవలి బంగ్లాదేశ్‌తో సిరీ్‌సలోనూ అదే జరిగింది. మిడిలార్డర్‌ మాత్రం ఆదుకుంటోంది. సీనియర్లు శాన్‌ విలియమ్స్‌, సికిందర్‌ రజా బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఈ ఇద్దరికి మినహా మరెవరికీ పెద్దగా అనుభవం లేకపోవడంతో భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమవుతోంది. అయినా తొలి వన్డేలో టెయిలెండర్లు చక్కటి పోరాటాన్ని కనబరిచారు. దీన్ని ప్రేరణగా తీసుకుని టాపార్డర్‌ రాణిస్తే భారత్‌కు పోటీనివ్వగలదు.జట్లు 

(అంచనా) భారత్‌:గిల్‌, ధవన్‌, ఇషాన్‌, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), దీపక్‌ హుడా, శాంసన్‌, అక్షర్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌, ప్రసిద్ధ్‌, సిరాజ్‌.


జింబాబ్వే: ఇన్నోసెంట్‌ కెయా, మరుమణి/ కైటానో, మధెవెరె, విలియమ్స్‌, రజా, చకబ్వ (కెప్టెన్‌), బుర్ల్‌, జోంగ్వే, ఇవాన్స్‌, ఎన్‌గరవ, న్యౌచీ. పిచ్‌, వాతావరణం:హరారే పిచ్‌ ఆరంభంలో పేసర్లకు అనుకూలించనుంది. ఆ తర్వాత బ్యాటర్లు చెలరేగే అవకాశముంది. ఇక మ్యాచ్‌కు వర్షం నుంచి అంతరాయం లేకపోవచ్చు.

Updated Date - 2022-08-20T12:15:53+05:30 IST