ఎంపీలకు క్రీడా పరిజ్ఞానం సున్నా

ABN , First Publish Date - 2020-07-12T09:04:02+05:30 IST

దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. కొందరు పార్లమెంట్‌ ...

ఎంపీలకు క్రీడా పరిజ్ఞానం సున్నా

క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు

న్యూఢిల్లీ: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు.  కొందరు పార్లమెంట్‌ సభ్యులు (ఎంపీలు) సహా దేశంలో చాలా మందికి ఆటలపై అంతగా అవగాహన లేదని విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పొందిన సైకిల్‌ అమ్మాయి జ్యోతి కుమారి, కంబల జాకీ శ్రీనివాస గౌడ, మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్‌ గుర్జార్‌ లాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఒలింపిక్‌ పతకాలు సాధిస్తారని సహచర ఎంపీలు కూడా భావించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని రిజిజు అన్నారు. ‘క్రికెట్‌ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇంగ్లిష్‌ వాళ్లను ఆ ఆటలో ఓడించాలి. ఇదే ప్రతి ఒక్కరి మనసులో నాటుకుపోయింది. ఆ దృష్టితోనే క్రికెట్‌ను నేర్చుకున్నారు. మిగతా ఆటలపై కనీస అవగాహన లేదు. కానీ, బంగారు పతకాలు మాత్రం రావాలంటారు’ అని చెప్పారు. 

Updated Date - 2020-07-12T09:04:02+05:30 IST