సీపీఎల్‌ కోసం మళ్లీ రిటైర్మెంట్‌

ABN , First Publish Date - 2020-07-08T08:08:17+05:30 IST

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ఆడడానికి వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబేకు లైన్‌ క్లియర్‌ అయింది. అతడు అన్ని ఫార్మాట్ల నుంచి ...

సీపీఎల్‌ కోసం మళ్లీ రిటైర్మెంట్‌

ముంబై: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ఆడడానికి వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబేకు లైన్‌ క్లియర్‌ అయింది. అతడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ కావడంతో బీసీసీఐ అతడిని అడ్డుకొనే అవకాశాలు లేవు. సీపీఎల్‌ ప్లేయర్ల డ్రాఫ్ట్‌లో తాంబేను ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఎంపిక చేసుకొంది. కానీ, అతడికి బోర్డు ఎన్‌వోసీ ఇస్తుందా? అనే అనుమానం సర్వత్రా వ్యక్తమైంది. అయితే, తొలుత రిటైర్మెంట్‌ ప్రకటించిన తాంబే.. దాన్ని వెనక్కుతీసుకున్నాడని, తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు  ఈ-మెయిల్‌ పంపాడని ముంబై క్రికెట్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడు ‘రిటైర్డ్‌’ ప్లేయర్‌ అని ధ్రువీకరించారు.

Updated Date - 2020-07-08T08:08:17+05:30 IST