Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఢిల్లీ-తిరుపతి మధ్య స్పైస్‌జెట్‌ విమాన సర్వీసు

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌.. ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసును ప్రారంభించింది. ఆదివారం నాడిక్కడ కేంద్ర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ఈ విమాన సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. దేశ రాజధాని నుంచి తిరుపతికి నాన్‌ స్టాప్‌ సర్వీసును ప్రారంభించటం ఇదే తొలిసారని స్పైస్‌జెట్‌ పేర్కొంది. వారంలో (బుధ,శుక్ర,ఆదివారాలు) మూడు రోజుల పాటు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా ఈ నెల 31 నుంచి సోమవారం కూడా ఈ సర్వీసు అందుబాటులో ఉండనుందని వెల్లడించింది. ఈ మార్గంలో బోయింగ్‌ 737 విమానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపింది. కాగా స్పైస్‌జెట్‌ ఇప్పటికే హైదరాబాద్‌, పుణె నుంచి  తిరుపతికి విమానాలను నడుపుతోంది. 

Advertisement
Advertisement