కోవిడ్ బాధితులు చివర్లో రావొద్దు: జవహర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-08-08T21:28:39+05:30 IST

రాష్ట్రంలో కరోనా మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు

కోవిడ్ బాధితులు చివర్లో రావొద్దు: జవహర్‌ రెడ్డి

అమరావతి: రాష్ట్రంలో కరోనా మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు నియంత్రణలో ఉందని చెప్పారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తీవ్ర జ్వరం, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలన్నారు. టెస్టులు, ఫలితాలతో సంబంధం లేకుండా ఆస్పత్రిలో చేర్చుకోవాలన్నారు. 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్‌ శాతం ఉన్నవారు వాలంటీర్‌, ఏఎన్‌ఎంకు చెప్పాలన్నారు. చివరి నిమిషంలో ఆస్పత్రికి వస్తే కోలుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-08-08T21:28:39+05:30 IST