అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన స్పీకర్

ABN , First Publish Date - 2021-08-15T23:03:15+05:30 IST

భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన స్పీకర్

హైదరాబాద్: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు వాణీ దేవి, రఘోత్తమ రెడ్డి, విజీ గౌడ్, తేరా చిన్నప్ప రెడ్డి, జనార్దన్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, చీఫ్ మార్షల్ కర్ణాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం అనేది  కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా 135 కోట్ల మంది భారతీయులు జరుపుకునే పండుగ అన్నారు.ఎందరో మహానుభావుల, పోరాట యోదుల త్యాగాల ఫలితమే నేటి మన స్వేచ్ఛ ఫలాలని అన్నారు. మహాత్ముడి శాంతియుత పోరాటం, అహింసాయుత మార్గంలో స్వాతంత్ర్య సాదించుకున్నాం. ప్రగతిశీల, సంక్షేమ పరిపాలన అందించడానికి మనమందరం పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2021-08-15T23:03:15+05:30 IST