Abn logo
Sep 26 2020 @ 00:43AM

వచ్చి వెళ్లిన గంధర్వ లోకవాసీ

ఎవరైనా పోతే ఏడ్వడం రాదు

ఈసారెందుకో ఏడుపు ఆగడం లేదు

భావాలు బరువై మాట మూగపోయింది

బుర్రలోని గ్రామ్‌ఫోన్ ఒక్కసారిగా ఆగింది

అలసిన మనసుకు సాంత్వన నీ స్వరం

ఉరుకుల జీవితాలలో ఊరట నీ పాట

ఎంతో మంది మహానుభావులచే

పాడింపబడిన నీది అదృష్టమైతే

నీచే పలికించబడిన భాషదీ అదృష్టము

నీ గళం నుంచి చిలికిన భాషా పాటా 

వినిపించబడిన మాదీ అదృష్టము


-రూప

Advertisement
Advertisement
Advertisement