Advertisement
Advertisement
Abn logo
Advertisement

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. మ్యాచ్ గెలిస్తే సెమీస్‌కు!

అబుదాబి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సఫారీలకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఇందులో గెలిస్తే ఆ జట్టు సెమీస్ అవకాశాలు మరింత బలపడతాయి. బంగ్లాదేశ్‌కు మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన బంగ్లాదేశ్ ఖాతా కూడా తెరవలేకపోయింది.


సౌతాఫ్రికా మాత్రం మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించి నాలుగు పాయింట్లతో గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా బంగ్లాదేశ్ జట్టులో మాత్రం మార్పులు చోటుచేసుకున్నాయి. ముస్తాఫిజుర్‌కు తుది జట్టులో చోటు లభించలేదు. అలాగే, గాయం కారణంగా షకీబల్ హసన్ తప్పుకున్నాడు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement