ఊపిరి పోసిన సోనూసూద్‌

ABN , First Publish Date - 2021-06-11T09:13:06+05:30 IST

కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్న రియల్‌ హీరో సోనూసూద్‌ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు

ఊపిరి పోసిన సోనూసూద్‌

కుప్పం, జూన్‌ 10: కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్న రియల్‌ హీరో సోనూసూద్‌ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలోని గుడుపల్లె రైల్వేస్టేషన్‌ సమీపంలో నివసిస్తున్న నాగేష్‌ (55)కు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆక్సిజన్‌తోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సొంతంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ కొనుగోలు చేసేంత స్తోమత లేకపోవడంతో విషయాన్ని స్థానిక చిత్రకారుడు పురుషోత్తం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ సమాచారాన్ని సోనూసూద్‌కు చేరవేశారు. అదేరోజు రాత్రికల్లా సోనూ పంపిన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ నాగే్‌షకు అందింది. ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-06-11T09:13:06+05:30 IST