నాస్తిక ‘విజయం’ ఇక లేరు

ABN , First Publish Date - 2020-05-23T08:16:16+05:30 IST

నాస్తిక ఉద్యమ నిర్మాత, విజయవాడలో నాస్తిక కేంద్రం వ్యవస్థాపకుడు గోరా కుమారుడు విజయం అనారోగ్యంతో ..

నాస్తిక ‘విజయం’ ఇక లేరు

గోరా ఐదో సంతానం.. డాక్టర్‌ సమరం సోదరుడు

ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాలకు విజయం భౌతికకాయం


విజయవాడ, మే 22(ఆంధ్రజ్యోతి): నాస్తిక ఉద్యమ నిర్మాత, విజయవాడలో నాస్తిక కేంద్రం వ్యవస్థాపకుడు గోరా కుమారుడు విజయం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. విజయవాడ బెంజ్‌సర్కిల్‌కు సమీపాన ఉన్న నాస్తిక కేంద్రం ఆవరణలోనే విజయం నివాసం ఉంటున్నారు. ఈ కేంద్రానికి ఆయన ఈడీగా వ్యవహరిస్తున్నారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన సతీమణి సుమతి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. గోరాకు మొత్తం తొమ్మిది మంది సంతానంలో విజయం ఐదోవ వారు. విజయం భౌతికకాయాన్ని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాలకు కుటుంబ సభ్యులు దానం చేశారు.

Updated Date - 2020-05-23T08:16:16+05:30 IST