‘అది తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది’

ABN , First Publish Date - 2020-08-05T03:48:46+05:30 IST

ప్రభుత్వ నిర్ణయాలు న్యాయపరంగా, రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో, లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు

‘అది తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది’

అమరావతి: ప్రభుత్వ నిర్ణయాలు న్యాయపరంగా, రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో, లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సోమిరెడ్డి స్పందించారు. ఇదే అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఏపీ హైకోర్టును అమరావతిలో అని నిర్ణయించినప్పుడే సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతి కూడా ఆమోదించారని సోమిరెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను మార్చలేవని చట్టాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. గవర్నర్‌ మాత్రం హైకోర్టు తరలింపుతో కూడిన మూడు రాజధానుల బిల్లుపై సంతకాలు పెట్టేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే దుందుడుకు నిర్ణయాలను రాజ్ భవన్ వ్యవస్ధ ఆషామాషీగా తీసుకోకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ఉత్తర్వులివ్వడం మంచిదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-08-05T03:48:46+05:30 IST