కేసీఆర్‌ని చూసైనా కొందరు నేర్చుకోవాలి: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-03-29T20:55:00+05:30 IST

సీఎం కేసీఆర్‌ని చూసైనా కొందరు నేర్చుకోవాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. ‘‘నేను.. నా వల్లే జరగాలనుకునే ఇగోయిస్టులకు కేసీఆర్ తీరు కనువిప్పుకావాలి.

కేసీఆర్‌ని చూసైనా కొందరు నేర్చుకోవాలి: సోమిరెడ్డి

అమరాతి: సీఎం కేసీఆర్‌ని చూసైనా కొందరు నేర్చుకోవాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. ‘‘నేను.. నా వల్లే జరగాలనుకునే ఇగోయిస్టులకు కేసీఆర్ తీరు కనువిప్పుకావాలి. కేసీఆర్‌ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే పరిస్థితులను బట్టి సడలింపులు, పట్టువిడుపుల్లో ముందుంటారు. ప్రజల క్షేమం కోరుకునే ఏ నాయకుడికైనా ఈ లక్షణాలు ఉండాలి. కేసీఆర్ రాజకీయంగా ప్రత్యర్థి అయినా ఈ రెండు మాటలు చెప్పకతప్పలేదు’’ అని సోమిరెడ్డి అన్నారు.

Updated Date - 2020-03-29T20:55:00+05:30 IST