ఉక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్: Russiaలో ఒరాకిల్ కార్యకలాపాల నిలిపివేత

ABN , First Publish Date - 2022-03-03T17:27:30+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి చేస్తున్న నేపథ్యంలో బిజినెస్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ కార్ప్ రష్యాలో అన్ని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపింది....

ఉక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్: Russiaలో ఒరాకిల్ కార్యకలాపాల నిలిపివేత

శాన్ ఫ్రాన్సిస్కో: ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి చేస్తున్న నేపథ్యంలో బిజినెస్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ కార్ప్ రష్యాలో అన్ని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపింది.రష్యా దాడుల తర్వాత ఆ దేశంలో ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ అమ్మకాలను నిలిపివేసింది. ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రి రెండు కంపెనీలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేసిన మూడు గంటల తర్వాత ట్విట్టర్‌లో ఒరాకిల్ ప్రకటన వచ్చింది.రష్యన్ ఫెడరేషన్‌లో అన్ని కార్యకలాపాలను ఇప్పటికే నిలిపివేశామని ఒరాకిల్ పేర్కొంది. ఉక్రెయిన్ పై యుద్ధం సాగిస్తున్నందున రష్యాలో తమ సేవలు, ఉత్పత్తుల విక్రయాలని నిలిపివేస్తున్నట్లు ఒరాకిల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ క్లైన్ చెప్పారు. ఉక్రెయిన్ దేశానికి సహాయంగా తాము 1 మిలియన్ యూరోలు ఇస్లామని ఒరాకిల్ ప్రకటించింది. దీంతో తమ కార్యాలయాలను శరణార్ధులకు వసతిగా మార్చడానికి కూడా ఒరాకిల్ అంగీకరించింది. 


Updated Date - 2022-03-03T17:27:30+05:30 IST