పెళ్లి కావడం లేదన్న కలతతో టెకీ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-27T10:26:58+05:30 IST

ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగి. వేలల్లో జీతం.. కానీ పెళ్లి కావడం లేదన్న కారణంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెళ్లి కావడం లేదన్న కలతతో టెకీ ఆత్మహత్య

సదాశివనగర్‌, ఆగస్టు 26:  ఆయనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగి. వేలల్లో జీతం.. కానీ పెళ్లి కావడం లేదన్న కారణంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఆకుల రాజ్‌కుమార్‌ (28) ముంబైలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా ప్రస్తుతం స్వగ్రామంలోని ఇంటి నుంచే పని చేస్తున్నాడు. రాజ్‌కుమార్‌కు గత నాలుగేళ్ల నుంచి కుటుంబీకులు పెళ్లి సంబంధం చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడం లేదు. గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 

Updated Date - 2021-08-27T10:26:58+05:30 IST