KPHB: కేపీహెచ్‌బీలో కనిపించకుండా పోయిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాపం చివరికిలా..

ABN , First Publish Date - 2022-07-03T23:23:52+05:30 IST

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అదృశ్యమైన నారాయణ రెడ్డి అనే 25 ఏళ్ల యువకుడు జిన్నారంలో హత్యకు గురయ్యాడు. దారుణంగా హత్య చేసి..

KPHB: కేపీహెచ్‌బీలో కనిపించకుండా పోయిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాపం చివరికిలా..

హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన నారాయణ రెడ్డి అనే 25 ఏళ్ల యువకుడు జిన్నారంలో హత్యకు గురయ్యాడు. దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టారు. కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ 1 లో స్నేహితుడితో కలిసి నారాయణ రెడ్డి (25) నివసిస్తూ ఉండేవాడు. గత నెల 30వ తేదీన కనిపించకుండాపోయాడు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆదివారం అతని మృతదేహం కాలిన స్థితిలో జిన్నారం ప్రాంతంలో కనిపించింది. ప్రేమ వ్యవహారమే అతని హత్యకు కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంవత్సరం క్రితం నారాయణ రెడ్డి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు, యువతిని బలవంతంగా తీసుకుని వెళ్లి హౌజ్ అరెస్ట్ చేశారు.



అయితే.. గత నెల నుంచి సదరు యువతితో నారాయణ రెడ్డి టచ్‌లో ఉన్నాడు. ఈ విషయం తెలిసి యువతి బంధువు శ్రీనివాస్ రెడ్డి నారాయణ రెడ్డిని బెదిరించాడు. ఇంతలోనే నారాయణరెడ్డి కనిపించకుండాపోవడం, శవమై తేలడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మూడు రోజుల క్రితం హత్య చేసి ఇక్కడ తెచ్చి కాల్చేసి ఉండొచ్చని చెప్పారు. పెట్రోల్ పోసి శవానికి నిప్పు పెట్టారని తెలిపారు. జిన్నారం మండలంలోని నల్తూరు గ్రామ శివారులో నారాయణరెడ్డి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. నారాయణరెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-07-03T23:23:52+05:30 IST