Advertisement
Advertisement
Abn logo
Advertisement

నల్లగొండలో సజావుగా ధాన్యం సేకరణ: గవర్నర్‌

నల్లగొండ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌కు సంబంధించి నల్లగొండలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతోందని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. వాతావరణ సమస్యల వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలో వానాకాలం పంట 70 శాతం మేరకు సేకరించారని తెలిపారు. నల్లగొండలోని షేర్‌ బంగ్లాలో పునఃప్రతిష్ఠించిన శ్రీభక్తాంజనేయ సహిత సంతోషిమాత ఆలయ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆర్జాలబావి, అనిశెట్టిదుప్పలపల్లిలోని ఐకేపీ కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. చర్లపల్లికి చెందిన మందడి మధుసూదన్‌రెడ్డి, పానగల్‌ నుంచి ధాన్యం తీసుకొచ్చిన మల్లమ్మ అనే రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. 


Advertisement
Advertisement