Abn logo
Nov 29 2020 @ 01:38AM

వచ్చే మూడేళ్లు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌దే హవా

  •  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 


వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ల్లో క్రమానుగత పెట్టుబడులు (సిప్‌) పెట్టడం ద్వారా మంచి రిటర్నులు అందుకునే అవకాశం ఉందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటోంది. కొవిడ్‌-19 ప్రభావం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడం మిడ్‌క్యాప్‌ పోర్టుఫోలియో ఎంతగానో కలిసిరానుందని పేర్కొంది. ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లు బుల్‌ రన్‌లో సాగుతున్నాయని, ఇది మిడ్‌, స్మాల్‌క్యా్‌ప్సకు కలిసివచ్చే అవకాశమని తెలిపింది. ప్రస్తుతమున్న మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్టుగా ఐసీఐసీఐ ప్రుడిన్షియల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఈ ఫండ్‌ ద్వారా హెల్త్‌కేర్‌ సర్వీసులు, స్పెషాలిటీ కెమికల్స్‌, వైట్‌ గూడ్స్‌ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. అలాగే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ కూడా మంచి లాభాలను అందించే వాటిల్లో పెట్టుబడులు పెట్టనుందని తెలిపింది. మార్కెట్లు దూకుడుగా సాగుతున్న ప్రస్తుత సమయంలో కొన్ని స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఇంకా ఇందులో పాలుపంచుకోలేదని, వచ్చే ఏడాది నుంచి మూడేళ్లలో ఇవి ఆశించిన స్థాయిలకు చేరుకునే అవకాశాలున్నాయని, వెల్లడించింది. 


Advertisement
Advertisement
Advertisement