Abn logo
Sep 22 2020 @ 10:43AM

ఇద్దరు యువకులు అఘాయిత్యం చేశారనే ఆవేదనతో 16 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య

జైపూర్ (రాజస్థాన్) : ఇద్దరు యువకులు తనపై అత్యాచారం చేశారనే ఆవేదనతో 16 ఏళ్ల వయసుగల ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ జిల్లాలో వెలుగుచూసింది. మృతురాలైన 16 ఏళ్ల బాలికకు బంటీ అనే 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. బంటీ  తన స్నేహితుడు హర్కేష్ తో కలిసి బాలిక ఇంటికి వచ్చి ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో తన కూతురు ఆవేదనతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులైన బంటీ, హర్కేష్ లను అరెస్టు చేశారు.పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.