Abn logo
Apr 21 2021 @ 01:09AM

వృద్ధికి విశ్వాసమే పునాది

  • మర్చంట్స్‌ చాంబర్‌ సమావేశంలో నిర్మల


న్యూఢిల్లీ/కోల్‌కతా: దేశంలో వృద్ధిలో స్థిరత్వం కావాలంటే పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సంపూర్ణ విశ్వాసం అవసరమని ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ అన్నారు. మర్చంట్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా రెండో విడత ఉదృతంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి కేంద్రప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నదని చెప్పారు. పునరుజ్జీవం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉన్నదన్న భావన అందరిలోనూ ఉండాలని విజ్ఞప్తి చేస్తూ పరిశ్రమ విశ్వాసం ఏ మాత్రం తగ్గినా అది అపనమ్మకానికి దారి తీస్తుందని ఆమె అన్నారు. ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి మధ్యన గల సుహృద్భావపూర్వక సంబంధం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. దేశానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేందుకు రెండు వ్యవస్థలు  కలసికట్టుగా కృషి చేస్తాయని నిర్మల హామీ ఇచ్చారు. 


Advertisement
Advertisement
Advertisement