కారును మింగిన సింక్‌హోల్.. న్యూయార్క్‌లో..
ABN , First Publish Date - 2020-11-27T22:11:26+05:30 IST
ఇంటిముందు నిలిపి ఉంచిన కారు ఉన్నట్టుండి అమాంతం భూమిలో కూరుకుపోవడం మనం ప్రత్యక్షంగా చూస్తే.. మన ఫీలింగ్ ఎలా ఉంటదో మాటల్లో చెప్పడం కష్టం.
న్యూయార్క్: ఇంటిముందు నిలిపి ఉంచిన కారు ఉన్నట్టుండి అమాంతం భూమిలో కూరుకుపోవడం మనం ప్రత్యక్షంగా చూస్తే.. మన ఫీలింగ్ ఎలా ఉంటదో మాటల్లో చెప్పడం కష్టం. అచ్చం ఇలాంటి పరిస్థితే న్యూయార్క్‌లో ఓ వ్యక్తికి ఎదురైంది. కళ్ల ముందే తన ఇంటి ముందు నిలిచి ఉన్న కారు అమాంతం నేలలోకి దిగిపోవడం చూసి ఆయనకు నోటమాట రాలేదు. ఈ షాకింగ్ ఘటన న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జరిగింది. తుప్టెన్ టాప్జీ అనే వ్యక్తికి చెందిన ఎస్యూవీ కారు ఇలా ఊహించని ప్రమాదానికి గురైంది. ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు ఉన్నట్టుండి భూమిలో కూరుకుపోవడం జరిగింది.
అయితే, కారు ఆగి ఉన్న చోట కిందవైపు సింక్‌హోల్(డ్రైనేజీ లైన్) ఉండడం.. పైన ఉన్న నేల కాస్తా బలహీనపడడంతో ఒక్కసారిగా అది లోపలికి కూలిపోయింది. ఈ ఘటనను టాప్జీ ప్రత్యక్షంగా చూశారు. "నిజంగా ఇది షాకింగ్ ఘటన. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది." అని టాప్జీ తెలిపారు. కారును సింక్‌హోల్ మింగేసిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను టాప్జీ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.