సింగరేణిలో సమ్మె సైరన్‌!

ABN , First Publish Date - 2020-04-03T07:36:09+05:30 IST

కరోనా నేపథ్యంలో సింగరేణి యాజమాన్య నిర్ణయాలకు నిరసనగా సంస్థలోని జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ...

సింగరేణిలో సమ్మె సైరన్‌!

కార్మిక సంఘాల సమ్మె నోటీసు...


మంచిర్యాల/గోదావరిఖని/ఇల్లెందు/కొత్తగూడెం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో సింగరేణి యాజమాన్య నిర్ణయాలకు నిరసనగా సంస్థలోని జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎ్‌స, సీఐటీయూ, బీఎంఎస్‌ తదితర యూనియన్ల నేతలు గురువారం సంస్థ సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు. సింగరేణి కాలరీ్‌సలో కరోనా వైరస్‌ కారణంగా డీజీఎంఎస్‌ ఆదేశాలకు భిన్నంగా లేఆఫ్‌ ప్రకటించడం, కార్మికుల, ఉద్యోగుల ఆంగీకారం లేకుండా ఒకరోజు వేతనం ముఖ్యమంత్రి సహాయనిధికి కేటాయించడం, కార్మికుల వేతనాల్లో 50శాతం కోత విధించడాన్ని కార్మిక సంఘాలు తప్పుబట్టాయి. పారిశ్రామిక వివాదాల చట్టంలోని 22(1) సెక్షన్‌ ప్రకారం భూగర్భ గనులలో పనిచేసేవారికి పూర్తి జీతం ఇవ్వాలని, లే-ఆ్‌ఫకు బదులు భూగర్భ గనులలో లాక్‌డౌన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  సమ్మె నోటీసు ప్రతులను ఢిల్లీలోని చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌కు, హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌కు,  జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు, కమిషనర్లకు పంపించినట్లు యూనియన్‌ నాయకులు పేర్కొన్నారు.  

Updated Date - 2020-04-03T07:36:09+05:30 IST