సింగరేణి ‘జేఏ’ మార్కుల్లోనూ గందరగోళమే..

ABN , First Publish Date - 2022-09-12T08:38:09+05:30 IST

ఇల్లెందు/కాకతీయఖని, సెప్టెంబరు 11: సింగరేణి కాలరీ్‌సలో జూనియర్‌ అసిస్టెంట్‌ రాతపరీక్షల నిర్వహణ నుంచి ర్యాంకుల కేటాయింపు వరకు అంతా అస్తవ్యస్తంగా మారింది. ఈ నెల 1

సింగరేణి ‘జేఏ’ మార్కుల్లోనూ గందరగోళమే..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, డిగ్రీ పేర్లతో మార్కులు!

ఇల్లెందు/కాకతీయఖని, సెప్టెంబరు 11: సింగరేణి కాలరీ్‌సలో జూనియర్‌ అసిస్టెంట్‌ రాతపరీక్షల నిర్వహణ నుంచి ర్యాంకుల కేటాయింపు వరకు అంతా అస్తవ్యస్తంగా మారింది. ఈ నెల 10న వెల్లడించిన ఫలితాలు అభ్యర్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. అభ్యర్థుల మెరిట్‌ జాబితాలో ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, డిగ్రీ’ అనే పేర్లతో మార్కులు, ర్యాంకులు ప్రకటించడంతో అభ్యర్థులు విస్తుపోతున్నారు. హాలు టికెట్‌ నెంబర్‌ 7709069 గల అభ్యర్థి పేరు ‘తెలంగాణ’గా చూపారు. అలాగే డిగ్రీ (హెచ్‌టీ నెంబర్‌ 2218581), ఆంధ్రప్రదేశ్‌ (హెచ్‌టీ నెంబర్‌ 204302) పేర్లతోనూ మార్కులు ప్రకటించారు. ప్రశ్నాపత్రంలోనే అనేక తప్పు లు దొర్లగా, వాటికి మూడు మార్కుల చొప్పున కలిపారు. ఇప్పుడు మార్కులు, ర్యాంకుల కేటాయింపులోనూ తప్పులు దొర్లడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

విజిలెన్స్‌ విచారణ ముమ్మరం

జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీలో దళారుల దందాపై విజిలెన్స్‌ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఆదివారం భూపాలపల్లి ఏరియాలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. కాకతీయ గెస్ట్‌హౌస్‌లో ఇద్దరు దళారులతోపాటు 40 మంది సింగరేణి కార్మికులను విచారించినట్లు సమాచారం.

Updated Date - 2022-09-12T08:38:09+05:30 IST