సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు!

ABN , First Publish Date - 2021-01-18T17:26:21+05:30 IST

సింగపూర్ తెలుగు సమాజం.. ఎప్పటిలాగే సంక్రాతి సందడిని ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించింది. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పని చేస్తున్న సిం

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు!

సింగపూర్ తెలుగు సమాజం.. ఎప్పటిలాగే సంక్రాతి సందడిని ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించింది. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పని చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం.. కొవిడ్ నిబంధన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో ఘనంగా జరిపింది. సింగపూర్‌లో నివసిస్తున్న బాలబాలికలు, యువతీ, యువకులు వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. చిన్నారులు చిత్రలేఖనం.. మహిళలు రంగవల్లుల పోటీల్లో పోటాపోటీగా పాల్గొన్నారు. అనంతరం సింగపూర్ కాలమానం ప్రకారం రూపొందించిన 2021 తెలుగు క్యాలెండర్‌ను సింగపూర్ తెలుగు సమాజం సభ్యులు ఆవిష్కరించారు. 



ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా కార్యవర్గాన్ని ఆదరిస్తూ వస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయ సహకారాలు ఇకపై ఇలానే కొనసాగించాలని కోరారు. సమజాన్ని మరింత ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. సొంత భవనం కలను సాకారం చేసుకునేందుకు బృహత్తర ప్రణాళికతో సింగపూర్ కార్యవర్గం రాబోతున్నట్టు ప్రకటించారు. నిర్వహణ కార్యదర్శలు శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి, ప్రసాద్ బుచు మాట్లాడుతూ..  కొవిడ్ నిబంధనల కారణంగా బోగి పండుగకు రేగుపండ్ల ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయలేకపోయాన్నారు. ప్రత్యేక్ష్యంగా కలువ లేకపోయినా అంతర్జాలంలో పండుగను జరుపుకోవడంపట్ల వాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. వివిధ పోటీల్లో పాల్గొని, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి సమాజం సభ్యులు బహుమతులు అందజేశారు. చివరగా సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 




Updated Date - 2021-01-18T17:26:21+05:30 IST