క్వార్టర్స్‌లో సింధు ఓటమి
ABN , First Publish Date - 2021-10-23T07:57:40+05:30 IST
భారత బ్యాడ్మింటన్ క్వీన్ పూసర్ల వెంకట సింధు, యువ షట్లర్ సమీర్ వర్మ డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఓటమి చవి చూశారు.
ఓడెన్స్: భారత బ్యాడ్మింటన్ క్వీన్ పూసర్ల వెంకట సింధు, యువ షట్లర్ సమీర్ వర్మ డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఓటమి చవి చూశారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కొరియా స్టార్ అన్ సియోంగ్‌తో తలపడిన సింధు పూర్తిగా తేలిపోయింది. కేవలం 36 నిమిషాలు మాత్రమే సాగిన ఈ పోరులో సింధు 11-21, 12-21తో వరుస సెట్లలో ఓడింది. ఇక, పురుషుల క్వార్టర్స్‌లో సమీర్ వర్మ తొలి సెట్లో 17-21తో ఓటమి పాలయ్యాక గాయం కారణంగా వెనుదిరిగాడు. దీంతో ప్రత్యర్థి టామీ సుగియార్తో (ఇండోనేసియా) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.