సింధు ‘ఫలితం’తో గందరగోళం!

ABN , First Publish Date - 2022-07-29T10:05:43+05:30 IST

బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టగానే షట్లర్లకు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా.. సింధు ఫలితంలో కొద్దిపాటి తేడాలుండడంతో ఆమెకు కొవిడ్‌ సోకినట్టు అనుమానించారు.

సింధు ‘ఫలితం’తో గందరగోళం!

బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టగానే షట్లర్లకు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా.. సింధు ఫలితంలో కొద్దిపాటి తేడాలుండడంతో ఆమెకు కొవిడ్‌ సోకినట్టు అనుమానించారు. దాంతో రెండో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితం వచ్చేవరకు బ్యాడ్మింటన్‌ జట్టునుంచి ఐసోలేట్‌ అవ్వాలని అధికారులు హైదరాబాదీకి సూచించడంతో కలకలం రేగింది. 10మంది సభ్యుల బ్యాడ్మింటన్‌ జట్టు గత సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి బయలుదేరి బర్మింగ్‌హామ్‌ వచ్చింది.


నిబంధనల ప్రకారం ప్రతీ క్రీడాకారుడు యూకే రావడానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇక్కడకు వచ్చాక మరోసారి ఆ పరీక్ష జరుపుతారు. ఆ పరీక్ష ఫలితం కాస్త అనుమానంగా ఉండడంతో సింధును పర్యవేక్షణలో ఉంచినట్టు భారత జట్టు వర్గాలు గురువారం వెల్లడించాయి. దాంతో భారత బృందం ఆందోళన చెందగా..రెండో ఆర్టీపీసీఆర్‌ ఫలితం నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం క్రీడా గ్రామంలో ప్రవేశించేందుకు సింధును అనుమతించారు. 


నిఖత్‌, లవ్లీనాకు సులువైన డ్రా

 వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌, ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌కు కామన్వెల్త్‌ మహిళల బాక్సింగ్‌ పోటీల ఆరంభ రౌండ్‌లలో సులువైన ప్రత్యర్థులు ఎదురు కానున్నారు. ఆదివారం జరిగే మహిళల లైట్‌ఫ్లై వెయిట్‌ (48-50కి.) విభాగం తొలి రౌండ్‌లో మొజాంబిక్‌కు చెందిన హెలెనా బగావోతో నిఖత్‌ తలపడనుంది. శనివారం జరిగే మిడిల్‌ వెయిట్‌ (66-70కి.) మొదటి రౌండ్‌లో లవ్లీనా .. అరియానె నికోల్సన్‌ (న్యూజిలాండ్‌)ను ఢీకొననుంది. 


అమ్జోలేలేతో హుసాముద్దీన్‌ ఢీ..: 

పురుషుల 54 కిలోల విభాగంలో గత క్రీడల కాంస్య పతక విజేత మహ్మద్‌ హుసాముద్దీన్‌ సౌతాఫ్రికాకు చెందిన అమ్జోలేలేతో మొదటి రౌండ్‌లో తలపడనున్నాడు. ఈబౌట్‌ ఈనెల 30న జరగనుంది. 


నేటి భారత షెడ్యూల్‌ 

(సోనీ నెట్‌వర్క్‌లో లైవ్‌)

క్రికెట్‌ : భారత్‌-ఆస్ట్రేలియా, సా. 4.30 నుంచి 

మహిళల హాకీ : భారత్‌-ఘనా, సా. 6.30

టీటీ : పురుషులు, మహిళల టీమ్‌ రౌండ్‌ -1

క్వాలిఫికేషన్స్‌: సా. 6.30

బ్యాడ్మింటన్‌ : మిక్స్‌డ్‌ గ్రూప్‌

మ్యాచ్‌: భారత్‌-పాకిస్థాన్‌: అశ్వినీ పొన్నప్ప/సుమిత్‌రెడ్డి: రా. 11 గం.

స్విమ్మింగ్‌ : 400మీ. ఫ్రీస్టయిల్‌, 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌, 50మీ. బటర్‌ఫ్లై; రా. 7.30

ట్రయాథ్లాన్‌ : పురుషులు, మహిళల వ్యక్తిగత స్ర్పింట్‌ డిస్టెన్స్‌ ఫైనల్‌: రా. 8 గం.

స్క్వాష్‌ : పురుషులు, మహిళల సింగిల్స్‌ ప్రిలిమినరీ రౌండ్‌-64: రా. 9 గం.

బాక్సింగ్‌ : పురుషుల రౌండ్‌-32: రా. 9 గం.

లాన్‌బౌల్‌ : మెన్స్‌ పారిస్‌, విమెన్‌ సింగిల్స్‌, విమెన్‌ ఫోర్స్‌: రా. 11.30 గం.

జిమ్నాస్టిక్స్‌: పురుషుల వ్యక్తిగత, టీమ్‌ క్వాలిఫయింగ్‌: మ.1.30

ట్రాక్‌సైక్లింగ్‌ : మెన్‌ టీం పర్స్యూట్‌ క్వాలిఫికేషన్‌: మ.2.30; విమెన్‌ టీం స్ర్పింట్‌ క్వాలిఫికేషన్‌: మ.2.30; విమెన్‌ టీం స్ర్పింట్‌ క్వాలిఫికేషన్‌: మ.2.30.

Updated Date - 2022-07-29T10:05:43+05:30 IST