జగిత్యాల: జిల్లాలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో పోలీస్ శాఖలో ప్రక్షాళన చేయడానికి ఎస్పీ సింధు శర్మ నడుం బిగించారు. తాజాగా జిల్లాలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేశారు. వరుస ఏసీబీ దాడులతో ఎస్పీ సింధు శర్మ చర్యలు ప్రారంభించారు. ఎస్సై వెంకట్ రావు, ఎస్సై ఆరోగ్యం, ఎస్సై చిరంజీవిలకు స్థానచలనం కలిగించారు. నిన్న వివిధ పీఎస్‌లలో పనిచేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు.