Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరో పండుగ హిట్‌కు శ్రుతి సిద్ధం

రవితేజ సరసన నటించిన ‘క్రాక్‌’తో సంక్రాంతికి సూపర్‌ హిట్‌ అందుకున్నారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌కు జంటగా నటించిన ‘వకీల్‌ సాబ్‌’తో ఉగాదికి ప్రేక్షకుల ముందుకొచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శ్రుతీ. ఆమె విజయ్‌ సేతుపతి సరసన కథానాయికగా నటించిన చిత్రం ‘లాభమ్‌’. ఈ సినిమాను రంజాన్‌ సందర్భంగా విడుదల చేయనున్నట్టు సేతుపతి ట్విట్టర్లో తెలిపారు. దీంతో శ్రుతీహాసన్‌ నటించిన మరో చిత్రం పండుగ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. సంక్రాంతి, ఉగాది పండుగలకు హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న శ్రుతి ‘లాభమ్‌’ చిత్రంతో రంజాన్‌  పండుగకు మరో హిట్‌ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. ‘లాభమ్‌’ చిత్రానికి దివంగత దర్శకుడు ఎస్‌పీ జననాథన్‌ దర్శకత్వం వహించారు. డి ఇమ్మాన్‌ సంగీతం అందించారు. జగపతిబాబు కీలకపాత్రలో నటించారు.

Advertisement
Advertisement