ప్రయాణికుల కొరత.. 24 రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2021-05-30T09:35:43+05:30 IST

ప్రయాణికుల కొరత కారణంగా వచ్చే నెల(జూన్‌)లో 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది.

ప్రయాణికుల కొరత.. 24 రైళ్లు రద్దు

హైదరాబాద్‌, మే 29(ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల కొరత కారణంగా వచ్చే నెల(జూన్‌)లో 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. తిరుపతి-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-యశ్వంత్‌పూర్‌ 2,3న.. తిరుపతి-చెన్నై 1న.. సికింద్రాబాద్‌-షిరిడీ 4,5న.. విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-షిరిడీ, తిరుపతి-మన్నార్‌గుడి, కాచిగూడ-రేపల్లె, కాకినాడ-రేణిగుంట 1,2న.. బిట్రగుంట-చెన్నై రైలును 1వ తేదీన రానుపోను రద్దు చేశారు. నాందెడ్‌-ఔరంగాబాద్‌,  ఔరంగాబాద్‌-రేణిగుంట 4న, ఔరంగాబాద్‌-నాందెడ్‌ 7న, రేణిగుంట-ఔరంగాబాద్‌ రైలును 5వ తేదీన రద్దు చేశారు. ఇక, నాందెడ్‌-తాండూరు రైలు జూన్‌ 1 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌ నుం చి మాత్రమే నడుస్తుంది. తాండూరు-పర్బని రైలును తాండూరు-సికింద్రాబాద్‌, నాందెడ్‌-పర్బని మధ్య  2 నుంచి 16 వరకు నడపనున్నారు. హైదరాబాద్‌-తిరుపతి-వాస్కోడిగామ రైలు 3 నుంచి 10 వరకు హుబ్లీ, వాస్కోడిగామ మధ్య.. వాస్కోడిగామ-తిరుపతి-హైదరాబాద్‌ రైలు 4 నుంచి 11వ తేదీ వరకు వరకు వాస్కోడిగామ, హుబ్లీ మధ్య మాత్రమే తిరుగుతాయి.

Updated Date - 2021-05-30T09:35:43+05:30 IST