Abn logo
Aug 30 2020 @ 12:04PM

డాలర్ బాయ్ వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్ : పంజాగుట్ట యువతి కేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును దర్యాప్తును సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. కాగా.. ఈ కేసులో రోజుకో సంచలన విషయం బయటికొస్తోంది. డాలర్ బాయ్ అలియాస్ రాజా శ్రీరెడ్డి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. డాలర్ బాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. డాలర్ నిర్వహిస్తున్న కార్యాలయంలో కొంత మంది అమ్మాయిల సర్టిఫికెట్లను పోలీసులు గుర్తించారు. అయితే.. ఆ సర్టిఫికెట్స్ ఈ కార్యాలయంలోకి ఎలా వచ్చాయి..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


సర్టిఫికెట్‌లో ఉన్న అమ్మాయిల వివరాలను ఖాకీలు సేకరిస్తున్నారు. డాలర్ బాయ్ కార్యాలయంలో పలు ఆడియో, వీడియో టేపులను కూడా సీసీఎస్ అధికారులు గుర్తించారు. డాలర్ బాయ్‌పై ఇప్పటికే పలు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఇలా డాలర్ బాయ్ వ్యవహారంలో రోజుకో కొత్త సంచలన విషయం బయటకొస్తున్నది. గతంలోనే సీసీఎస్‌లో డాలర్ బాయ్ భార్య ఫిర్యాదు చేశారు. రాజ శ్రీ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ పేరు చెప్పి మోసాలకు పాల్పడ్డాడా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement