ప్లిస్కోవాకు షాక్
ABN , First Publish Date - 2022-07-01T09:45:32+05:30 IST
వింబుల్డన్‌లో గతేడాది మహిళల సింగిల్స్ ఫైనలిస్ట్, ఆరోసీడ్ కరోలినా ప్లిస్కోవాకు చుక్కెదురైంది.
మూడో రౌండ్లో స్వియటెక్, నడాల్ వింబుల్డన్
లండన్: వింబుల్డన్‌లో గతేడాది మహిళల సింగిల్స్ ఫైనలిస్ట్, ఆరోసీడ్ కరోలినా ప్లిస్కోవాకు చుక్కెదురైంది. పురుషుల్లో రెండోసీడ్ నడాల్, నాలుగో సీడ్ సిట్సిపాస్, మహిళల టాప్ సీడ్ స్వియటెక్, మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా మూడోరౌండ్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బ్రిటన్‌కు చెందిన అన్‌సీడెడ్ కేటీ బౌల్టర్ 3-6, 7-6 (4), 6-4 స్కోరుతో చెక్ భామ ప్లిస్కోవాను తిరుగుముఖం పట్టించింది. మిగతా మ్యాచుల్లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియటెక్ 6-4, 4-6, 6-3తో ఖెర్కోవ్పై, నాలుగో సీడ్ బడోసా 6-3, 6-2తో ఇరీనా బారాపై, 8వ సీడ్ పెగులా 4-6, 6-3, 6-1తో డార్ట్‌పై, 13వ సీడ్ క్రజికోవా 6-3, 6-4తో గొలుబిక్పై, క్విటోవా 6-1, 7-5 (5)తో బోగ్డన్పై, హార్మనీ టాన్ 6-3, 6-4తో టోర్మోపై నెగ్గి మూడోరౌండ్ చేరారు. పురుషుల రెండో రౌండ్లో మాజీ చాంపియన్ నడాల్ 6-4, 6-4, 4-6, 6-3తో బెరాంకిస్పై గెలుపొందాడు. సిట్సిపాస్ 6-2, 6-3 7-5తో థాంప్సన్‌ను, కిర్గియోస్ 6-2, 6-3, 6-1తో క్రజినోవిక్ని ఓడించి మూడో రౌండ్లో అడుగుపెట్టారు.
సానియాకు నిరాశ
సానియా మీర్జా చివరి వింబుల్డన్ టోర్నీ నిరాశను మిగిల్చింది. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో సానియా- లూసీ హార్డెకా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-4, 4-6, 2-6తో పోలండ్/బ్రెజిల్ జంట మగ్దలినా- బియట్రోజ్ చేతిలో ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్‌లో రామ్‌కుమార్- బ్రికిక్ (బోస్నియా) జోడీ కూడా ఆరంభరౌండ్లోనే వెనుదిరిగింది.