Advertisement
Advertisement
Abn logo
Advertisement

పులివెందుల కోర్టులో శివశంకర్‌రెడ్డి

కడప: పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ముందు శివశంకర్‌రెడ్డిని  సీబీఐ హాజరుపర్చింది. కడప సెంట్రల్ జైలుకు శివశంకర్‌రెడ్డి తరలించారు. ఇటీవల శివశంకర్‌రెడ్డిని 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. 4 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్య కేసుకు సంబంధించి వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరో వైపు శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్య కేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మూడు రోజుల క్రితమే శస్త్ర చికిత్స చేయించుకున్నారని వైద్యుల నిరంతర పర్యవేక్షణ, యాంటి బయాటిక్స్ అవసరమని సూచించారు. తమ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement