వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న రిపోర్టర్ కొంపముంచిన తండ్రి.. ఫ్లోరిడాలో..

ABN , First Publish Date - 2020-04-03T01:58:04+05:30 IST

కొవిడ్-19 ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఉద్యోగులకు ఆదేశాలిచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొంతమందికి

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న రిపోర్టర్ కొంపముంచిన తండ్రి.. ఫ్లోరిడాలో..

ఫ్లోరిడా: కొవిడ్-19 ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఉద్యోగులకు ఆదేశాలిచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొంతమందికి లాభం కలుగుతోంటే.. మరి కొంతమందికి నష్టం కలుగుతోంది. నష్టం ఏ విధంగా కలుగుతోందంటే.. అనేక మంది ఉద్యోగులు వీడియో కాలింగ్ ద్వారా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఇలాంటి వారికి ఇంట్లో వారి నుంచి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అనేక మంది వల్ల ఆఫీసులో ఉన్నంత సౌకర్యం ఉండదు. ఫ్లోరిడాకు చెందిన రిపోర్టర్‌కు ఎదురైన కష్టం చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో తెలుస్తుంది.


ఫ్లోరిడాలోని తంపాకు చెందిన జెస్సికా రిపోర్టర్‌గా పనిచేస్తోంది. కరోనా కారణంగా ఆమె ఇంటి నుంచే రిపోర్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ఆమె ఇంట్లో ఉన్న కిచెన్ నుంచే రిపోర్టింగ్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో.. ఫ్రేమ్‌లోకి ఒక్కసారిగా ఆమె తండ్రి వచ్చాడు. ఫ్రేమ్‌లోకి తండ్రి రావడం పెద్ద ఇబ్బంది కాదు కాని... ఆయన అదే సమయంలో టీ షర్ట్ వేసుకుంటుండటం.. ఆయన భారీ పొట్ట కనిపించడం ఇబ్బందిగా మారింది. జెస్సికా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ సులభం అని అన్నారు కానీ పరిస్థితి ఇలా ఉంటుందంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తాను స్కైప్ ద్వారా పనిచేసే సమయంలో తన పెంపుడు కుక్క కూడా ఇబ్బంది పెడుతోందంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.



Updated Date - 2020-04-03T01:58:04+05:30 IST