అతనికి సెహ్వాగ్ సత్తా ఉంది.. కానీ క్రమశిక్షణ అవసరం: వసీం జాఫర్

ABN , First Publish Date - 2020-07-11T05:00:20+05:30 IST

భారత క్రికెట్‌లో యువకెరటం పృథ్వీ షాపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు.

అతనికి సెహ్వాగ్ సత్తా ఉంది.. కానీ క్రమశిక్షణ అవసరం: వసీం జాఫర్

ముంబై: భారత క్రికెట్‌లో యువకెరటం పృథ్వీ షాపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు. షా చాలా మంచి ఆటగాడని, ఎటువంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలడని జాఫర్ పేర్కొన్నాడు. ‘షా ప్రత్యేకమైన ఆటగాడు. అతనికి సెహ్వాగ్ సత్తా ఉంది. అయితే అతని ఆటను అతనే అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొంచెం నిదానించి ఆటను అర్థం చేసుకుంటే షా అద్భుతంగా రాణించగలడు’ అని జాఫర్ చెప్పాడు. అలాగే ఆటతోపాటు మిగతా విషయాల్లోనూ షా కొంత క్రమశిక్షణ పాటించాలని, అది ఉంటే షా మెరుగవుతాడని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-07-11T05:00:20+05:30 IST