ఈ ఏడాది టర్నోవర్‌లో 20% వృద్ధి షార్ప్‌

ABN , First Publish Date - 2022-05-21T08:39:43+05:30 IST

జపాన్‌కు చెందిన షార్ప్‌ కార్పొరేషన్‌కు భారత అనుబంధ సంస్థ షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ భారత్‌ను కీలక మార్కెట్‌గా భావిస్తోంది.

ఈ ఏడాది టర్నోవర్‌లో 20% వృద్ధి షార్ప్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జపాన్‌కు చెందిన షార్ప్‌ కార్పొరేషన్‌కు భారత అనుబంధ సంస్థ షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ భారత్‌ను కీలక మార్కెట్‌గా భావిస్తోంది. ప్రస్తుతం తైవాన్‌ నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తున్న కంపెనీ.. అన్నీ అనుకూలిస్తే భవిష్యత్తులో భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ ఎండీ షింజీ మినటోగవా తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కేంద్రం ఉందని.. కంపెనీ ఉత్పత్తులకు అవసరమైన సొల్యూషన్లను ఇక్కడే అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీ కొత్తగా 8 మల్టీ ఫంక్షనల్‌ ప్రింటర్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారంలో 25ు వృద్ధిని నమోదు చేశామని.. ఈ ఏడాది టర్నోవర్‌లో 20ు వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 

Updated Date - 2022-05-21T08:39:43+05:30 IST