హైదరాబాద్: పరకాల ఎన్నికల కేసు విచారణలో భాగంగా గురువారం నాంపల్లి కోర్టుకు వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని, కోడ్ ఉల్లంఘించినందుకుగాను పరకాల పోలీస్ స్టేషన్‌లో విజయలక్ష్మి, షర్మిల, కొండా సురేఖ దంపతులపై కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో పరకాల నుంచి వైసీపీ అభ్యర్థిగా కొండా సురేఖ బరిలో ఉన్నారు. ఈ కేసులో విచారణలో భాగంగా విజయలక్ష్మి, షర్మిల కోర్టుకు హాజరయ్యారు.