పాలపిట్ట వెనుక కథ ఇదీ..!

ABN , First Publish Date - 2021-08-06T08:53:40+05:30 IST

రాజన్న పాలన మళ్లీ తీసుకురావడమే వైఎ్‌సఆర్‌టీపీ ఎజెండా అని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు.

పాలపిట్ట వెనుక కథ ఇదీ..!

రాజన్న రాజ్యమే వైఎస్సార్‌టీపీ ఎజెండా

మా పోరాటంతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది: షర్మిల

హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాజన్న పాలన మళ్లీ తీసుకురావడమే వైఎ్‌సఆర్‌టీపీ ఎజెండా అని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. లోట్‌సపాండ్‌లో  గురువారం నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌, పోడు భూములకు పట్టాలు వైఎ్‌స ప్రారంభించినవేనని  చెప్పారు. సంక్షేమానికి చెరగని సంతకం వైఎ్‌సఆర్‌ అని, ఆయన సంక్షేమ పాలన నుంచే పార్టీ జెండా పుట్టుకొచ్చిందన్నారు. పాలపిట్ట రంగు సంక్షేమాన్ని సూచిస్తుందని, దసరా పండుగరోజు పాలపిట్టను చూేస్త సంతోషం కలుగుతుందని, పార్టీ జెండాను చూేస్త రెట్టింపు సంతోషం కలగాలన్న ఉద్దేశంతోనే పాలపిట్ట రంగును ఎంపికచేసినట్లు తెలిపారు.


నీలి రంగు సమానత్వాన్ని సూచిస్తుందని,  సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేడ్కర్‌ నినాదమే పార్టీ సిద్ధాంతమన్నారు. గ్రామగ్రామాన వైఎ్‌సఆర్‌ జెండా ఎగరేసి సంక్షేమ పాలన మళ్లీ  రాబోతుందని అందరికీ చెప్పాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.  సెప్టెంబర్‌ 5 వరకు నిర్వహిస్తున్న ఈ జెండా పండుగను ఊరూరా, గ్రామగ్రామాన నిర్వహించాలన్నారు. మనం పార్టీ పెట్టకముందే ప్రజల మధ్య ఉండి పోరాటం చేశామని,  మనం పోరాటం మొదలు పెట్టిన తర్వాత ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. వైఎ్‌సఆర్‌ అభిమానులంతా తన పక్కన నిలబడినందుకు  ధన్యవాదాలు తెలిపారు. కష్టపడి పనిచేేస్త తప్పకుండా గుర్తిస్తామని, తగిన స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.  జెండా పండుగ నిర్వహించే వారు సంబంధిత ఫోటోలను 8374167039కు వాట్సాప్‌ చేయాలన్నారు. వైఎస్సార్‌టీపీ గురించి ప్రతి గ్రామంలో మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు. కొత్తవారు వస్తున్నారని పాత వారు బాధపడకూడదని పేర్కొంటూ, వారంతా తన గుండెల్లో ఉన్నారని చెప్పారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్ద షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

Updated Date - 2021-08-06T08:53:40+05:30 IST