Shamshabad Road accidentలో కాంగ్రెస్ నేత కుమార్తె దుర్మరణం

ABN , First Publish Date - 2022-08-01T12:47:03+05:30 IST

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్(Congress leader Firozkhan) కుమార్తె తానియా రోడ్డు ప్రమాదం(Road accident)లో దుర్మరణం పాలైంది.

Shamshabad Road accidentలో కాంగ్రెస్ నేత కుమార్తె దుర్మరణం

Hyderabad : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్(Congress leader Firozkhan) కుమార్తె తానియా రోడ్డు ప్రమాదం(Road accident)లో దుర్మరణం పాలైంది. శంషాబాద్‌లో ఓ పార్టీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. తానియాతో పాటు మరో ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్(Shamshabad) నుంచి వస్తుండగా అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. తానియా మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి తరలించారు. ఫిరోజ్ ఖాన్ టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌‌(Nampally constuency Congress incharge)గా ఉన్నారు. తానియా బ్యూటీషియన్‌(Beautician)గా పని చేస్తోంది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు(Airport Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 



Updated Date - 2022-08-01T12:47:03+05:30 IST