కరోనా న్యూస్.. హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త!
ABN , First Publish Date - 2021-03-05T01:32:14+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ అంటూ ప్రచారం జరుగుతున్న వేళ్ హైదరాబాద్ ప్రజలకు ఓ శుభవార్త. నగరంలో ఏకంగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు సీసీఎంబీ, భారత్ బయోటెక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది.
హైదరాబాద్: కరోనా సెకెండ్ వేవ్ అంటూ ప్రచారం జరుగుతున్న వేళ హైదరాబాద్ ప్రజలకు ఓ శుభవార్త. నగరంలో ఏకంగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు సీసీఎంబీ, భారత్ బయోటెక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. హైదరాబాద్లో 30 వార్డుల్లో 9 వేల మంది నుంచి నమూనాల సేకరించి శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడైయ్యాయి.
పురుషుల్లో 53 శాతం మందిలో స్రీలల్లో 56 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక 70 ఏళ్లు పైబడిన 49 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు వెల్లడైంది. అంతేకాకుండా.. కరోనా నుంచి కోలుకున్న కుటుంబాల్లోని 78 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. ఈ విషయమై సీసీఎంబీ శాస్త్రవేత్త లక్ష్మయ్య ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఈ సర్వేకు సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. తొలి సెరో సర్వే ఎప్పుడు జరిగింది.. అప్పటికీ ఇప్పటికీ నగర ప్రజల్లో వచ్చిన మార్పేమిటీ వంటి వివరాలు తెలిపారు.