Abn logo
May 13 2021 @ 12:55PM

సీరియల్ రేపిస్ట్‌ అరెస్ట్

రాచకొండ: సీరియల్ రేపిస్టుని ఎల్‌బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దోపిడీ, దొంగతనంతో పాటు 20 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో బాల్య వివాహాలపై పోలీసులు నిఘా పెట్టారు. 4 సంవత్సరాల్లో 100కు పైగా కేసులను షీ టీమ్స్ నమోదు చేశాయి. దీనిపై రాచకొండ సీపీ మహేష్ భగత్ మాట్లాడుతూ..‘‘వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న హుస్సేన్ ఖాన్ అనే సీరియల్ రేపిస్ట్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ నారపల్లిలో నివాసం ఉంటాడు. కల్లు డిపో వద్దకు వస్తున్న మహిళలను టార్గెట్ చేసి వారి నగలు దొంగలించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడతాడు. 2016 లో నిందితుడిపై గోపాలపురం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు’’ అని వెల్లడించారు.Advertisement
Advertisement
Advertisement