సీరియల్‌ నటి.. సూపర్‌ సక్సెస్‌!

ABN , First Publish Date - 2022-02-27T09:23:17+05:30 IST

ఇండస్ర్టీలో రాత్రికి రాత్రే స్టార్డమ్‌ వస్తుంది కొందరికి. అయితే మృణాల్‌ ఠాకూర్‌ అలా కాదు. టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె ‘సూపర్‌ 30’ సినిమాతో బాలీవుడ్‌లో పాపులర్‌ అయింది...

సీరియల్‌ నటి.. సూపర్‌ సక్సెస్‌!

ఇండస్ర్టీలో రాత్రికి రాత్రే స్టార్డమ్‌ వస్తుంది కొందరికి. అయితే మృణాల్‌ ఠాకూర్‌ అలా కాదు. 

టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె ‘సూపర్‌ 30’ సినిమాతో బాలీవుడ్‌లో పాపులర్‌ అయింది. 

ఆ తర్వాత ‘తుఫాన్‌’ సినిమాతో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ జోడీగా ‘జెర్సీ’లో 

నటిస్తోన్న ఈ కథానాయిక బాలీవుడ్‌, దక్షిణాది చిత్రాలతో కెరీర్‌లో యమా బిజీగా ఉంది.


‘‘ఏదో సీరియల్స్‌లో నటించిన నేను.. ఇలా వస్తానని ఊహించలేదు. కానీ నమ్మకం ఉంది. విద్యాబాలన్‌, కంగనా రనౌత్‌, తాప్పీ పొన్ను లాంటి వాళ్లు రెవొల్యూషన్‌ యాక్టర్స్‌. సరికొత్త పాత్రలతో వాళ్లకు వాళ్లే ఛాలెంజ్‌ విసురుతారు. వారిని చూశాకే.. అర్థమైంది.. ఏ రోజైనా డిఫరెంట్‌ పాత్రలు చేస్తేనే పేరొసుం్తదిని! తొలినాళ్లలో రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రాతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అలా ‘సూపర్‌ 30’ చిత్రంలో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. హృతిక్‌ సినిమాలో నటించటం అదృష్టం. డెస్టినీ అని నమ్ముతాన్నేను.

అందుకే కెమెరా అవుదామనుకున్నా.. 

డెంటిస్ట్‌ అవ్వాలన్నదే నా కోరిక. ఎమ్‌టీవీలో లోలా కుట్టి అనే వీజే పాపులర్‌. ఆమె హోస్ట్‌ చేసిన ప్రోగ్రామ్స్‌ చూసేదాన్ని. అలా కెమెరా ముందుకు రావాలనే ఆలోచన కలిగింది. స్నేహితులంతా ‘టీవీలో న్యూస్‌ రీడర్‌ అవ్వు’ అనేవాళ్లు. నాకిష్టం ఉండేది కాదు. అయితే ఏదీ రాకుంటే న్యూస్‌ ఛానెల్‌లో జర్నలిస్ట్‌ అవ్వొచ్చు అనుకున్నా. అలాగైనా కెమెరా ముందు కనపడాలనేది నా తాపత్రయం. డిగ్రీ అయ్యాక.. ఓ సీరియల్‌లో నటి కావాలని యాడ్‌ చూసి.. ఆడిషన్‌కి వెళ్లా. అమ్మ పాత్రలో నటించమన్నారు. నటించాక.. కాన్ఫిడెంట్‌ వచ్చింది. 

అంతా ఆమె మహిమే.. 

సీరియల్స్‌లో అవకాశం వచ్చాక.. ఏమీ అర్థమయ్యేది కాదు. దర్శకుడు, తోటి నటులు సాయంతో ట్రిక్స్‌ తెలుసుకున్నా. మాధురీ దీక్షిత్‌ ఇష్టమైన నటి. ఆమెలా ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టాలనే ఆలోచనతో గంటలపాటు అద్దం ముందు సాధన చేసేదాన్ని. నా ఎక్స్‌ప్రెషన్స్‌ బావున్నాయని క్రిటిక్స్‌ ఎవరైనా అంటే.. అదంతా మాధురీ దీక్షిత్‌ మహిమే. సీరియల్స్‌ సెట్‌లో మేకప్‌, హెయిర్‌, డ్రెస్సింగ్‌ కోసం గంటలపాటు సహనంగా కూర్చోవాల్సిందే. అలా సహనం అలవడింది. కెరీర్‌ సినిమా కాబట్టి.. ఒంటరిగా ఉండేదాన్ని. ఏ వేళకు ఇంటికెళ్లినా ఎవరికీ ఇబ్బంది ఉండకూడదని. అయితే ఒంటరిగా ఉండటం.. నరకంగా ఉండేది. ఒత్తిడికి గురయ్యేదాన్ని. ప్రస్తుతం తెలుగు, తమిళం సినిమాలూ చూస్తున్నా. తెలుగు ‘జెర్సీ’సినిమాలో అవకాశం వచ్చాక చాలా సార్లు ఆ సినిమా చూశా. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. ప్రతిరోజూ నలభై ఐదు నిముషాలు వర్కవుట్స్‌ చేస్తా. సూర్యనమస్కారాలు చేస్తా. షూటింగ్స్‌ ఉన్నా వర్కవుట్స్‌ ఆపను. కరోనా సమయంలో జీవితం అనేది చాలా చిన్నది. హ్యాపీగా జీవించాలనే విషయం నేర్చుకున్నా. కెరీర్‌లో నిరంతరం సక్సెస్‌ మాయలో పడిపోకుండా.. ఎప్పటికప్పుడు జీవితాన్ని ఆస్వాదించాలన్నదే నా లక్ష్యం.


డెంటిస్ట్‌ అవ్వాలన్నదే నా కోరిక.ఎమ్‌టీవీలో లోలా కుట్టి అనే వీజే పాపులర్‌. ఆమె హోస్ట్‌ చేసిన ప్రోగ్రామ్స్‌ చూసేదాన్ని. అలా కెమెరా ముందుకు రావాలనే ఆలోచన కలిగింది.

Updated Date - 2022-02-27T09:23:17+05:30 IST