సెన్సెక్స్‌ 380 పాయింట్లు అప్‌

ABN , First Publish Date - 2022-08-17T06:25:56+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారంనాడు కూడా లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ 379.43 పాయింట్ల లాభంతో 59,842.21 వద్ద, నిఫ్టీ 127.10 పాయింట్ల

సెన్సెక్స్‌ 380 పాయింట్లు అప్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారంనాడు కూడా లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ 379.43 పాయింట్ల లాభంతో 59,842.21 వద్ద, నిఫ్టీ 127.10 పాయింట్ల లాభంతో 17,825.25 వద్ద ముగిశాయి. టోకు ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠానికి  రావడం మార్కెట్‌కు పెద్ద బూస్టర్‌లా పని చేసింది. ద్రవ్యో ల్బణం తగ్గుదలతో ఆర్‌బీఐ ఇక దూకుడుగా వడ్డీరేట్లు పెంచక పోవచ్చని మార్కెట్‌ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ఈ అంచనాతో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు,  బ్యారెల్‌ ముడి చమురు ధర ఈ  ఏడాది చివరికి 70 డాలర్లకు దిగొచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా మంగళవారం దేశీయ స్టాక్‌మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. సెన్సెక్స్‌ లాభాలతో ముగియడం వరుసగా ఇది మూడో సెషన్‌.

Updated Date - 2022-08-17T06:25:56+05:30 IST