వరుస నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ABN , First Publish Date - 2020-09-25T21:50:18+05:30 IST

రుసగా ఆరు రోజుల నుంచి నష్టాలు ఎదుర్కొంటున్న భారత స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఇవాళ ...

వరుస నష్టాలకు బ్రేక్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై:  వరుస నష్టాలు ఎదుర్కొంటున్న భారత స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఇవాళ మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 835 పాయింట్లు పుంజుకుని మరోసారి కీలకమైన 37 వేల మార్కును దాటింది. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల నేపథ్యంలో దేశీయ సూచీలు తేరుకున్నట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 835.06 పాయింట్ల (2.28 శాతం) లాభంతో 37,388.66 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సైతం 244.70 పాయింట్లు (2.26 శాతం) బలపడి 11,050.25 వద్ద క్లోజ్ అయ్యింది. బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ తదితర షేర్లు 6.64 శాతం మేర లాభం నమోదు చేశాయి.

Updated Date - 2020-09-25T21:50:18+05:30 IST