Advertisement
Advertisement
Abn logo
Advertisement

61,000 దిగువకు సెన్సెక్స్‌

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలు చవిచూశాయి. కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాల్లో నిస్తేజంతో పాటు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపారు. దీంతో గురువారం  బీఎ స్‌ ఈ సెన్సెక్స్‌ మరో 336.46 పాయింట్లు కోల్పోయి 60,923.50 వద్దకు జారుకుంది. ఒకదశలో సూచీ 60,500 దిగువకు పతనమైనప్పటికీ, చివర్లో కాస్త కోలుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 88.50 పాయింట్ల నష్టంతో 18,178.10 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో ఏషియన్‌ పెయింట్స్‌ అత్యధికంగా 5.21ు క్షీణించింది.   ఆర్‌ఐఎల్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ సైతం 2.85ు వరకు నష్టపోగా కోటక్‌ బ్యాంక్‌ షేరు 6.51 శాతం లాభపడింది

Advertisement
Advertisement