చివరి గంటలో యూటర్న్.. ఊరించి ఉసూరుమన్న స్టాక్ మార్కెట్లు!

ABN , First Publish Date - 2020-07-15T23:27:58+05:30 IST

గత సెషన్‌లోని నష్టాలను అధిగమించి ఇవాళ ఊహించని రీతిలో దలాల్ స్ట్రీట్‌ను ఊరించిన స్టాక్ మార్కెట్లు... ఆ సంబరంలో...

చివరి గంటలో యూటర్న్.. ఊరించి ఉసూరుమన్న స్టాక్ మార్కెట్లు!

ముంబై: గత సెషన్‌లోని నష్టాలను అధిగమించి ఇవాళ ఊహించని రీతిలో దలాల్ స్ట్రీట్‌ను ఊరించిన స్టాక్ మార్కెట్లు... ఆ సంబరంలో నుంచి తేరుకునే లోపే అమాంతం నేలకు పడిపోయాయి. డే సెషన్‌లో 777 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్... చివరి గంటలో యూటర్న్ తీసుకుని ఫ్లాట్‌గా ముగిసింది. అంతకు ముందు కొవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో పయనించగా.. దానికి తగినట్టుగా దేశీయ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వార్షిక సమావేశం నేపథ్యంలో కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పోటీపడడంతో కంపెనీ షేరు చూస్తుండగానే 4 శాతం మేర జీవితకాల కనిష్టానికి (రూ. 1,978.50) పడిపోయింది. దీని ప్రభావంతో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 18.75 పాయింట్ల స్వల్ప లాభంతో (0.05 శాతం) 36,051.81 వద్ద క్లోజ్ అయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10.85 పాయింట్ల లాభంతో (0.10 శాతం) 10,618.20 వద్ద ముగిసింది. అత్యధికంగా నష్టపోయిన వాటిలో భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ తదితర షేర్లు ఉన్నాయి. 

Updated Date - 2020-07-15T23:27:58+05:30 IST