మళ్లీ 60,000 దిగువకు సెన్సెక్స్‌

ABN , First Publish Date - 2022-08-20T06:10:29+05:30 IST

వరుసగా ఐదు రోజులపాటు ఎగబాకిన బీఎ్‌సఈ సెన్సెక్స్‌.. వారాంతం ట్రేడింగ్‌లో తిరోగమన బాటపట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల..

మళ్లీ 60,000 దిగువకు సెన్సెక్స్‌

ముంబై: వరుసగా ఐదు రోజులపాటు ఎగబాకిన బీఎ్‌సఈ సెన్సెక్స్‌.. వారాంతం ట్రేడింగ్‌లో  తిరోగమన బాటపట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గుచూపారు. రూపాయి క్షీణత, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకు పాల్పడటం మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచింది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి.. సెన్సెక్స్‌ 651.85 పాయింట్లు (1.08 శాతం) పతనమై 59,646.15 వద్దకు జారుకుంది. దాంతో సూచీ 60,000 కీలక స్థాయిని మళ్లీ కోల్పోయింది. ఎస్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా 8 రోజుల వరుస ర్యాలీకి తెరదించి 198.05 పాయింట్ల (1.10 శాతం) నష్టంతో 17,758.45 వద్ద ముగిసింది.  


20 పైసలు తగ్గిన రూపాయి: ఈక్విటీలతోపాటు కరెన్సీ కూడా డీలాపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు క్షీణించింది. దాంతో ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.79.84కు చేరుకుంది.  


భారీగా తగ్గిన వెండి: ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.1,607 తగ్గి రూ.56,247కు జారుకుంది. మేలిమి బంగారం (24 క్యారెట్లు) కూడా తులానికి రూ.389 తగ్గి రూ.51,995 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని బులియన్‌ వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో 1,753 డాలర్లకు పడిపోగా.. సిల్వర్‌ 19.23 డాలర్లకు దిగివచ్చింది. 

Updated Date - 2022-08-20T06:10:29+05:30 IST