Abn logo
Jul 11 2020 @ 18:06PM

నెల్లూరులో దారుణం.. వీడియో కాల్ చేసి ఆత్మహత్య

నెల్లూరు: నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బీవీనగర్‌లో శివభార్గవ్ అనే యువకుడు పలువురు అమ్మాయిలని ట్రాప్ చేసి ప్రేమ వ్యవహారాలు సాగిస్తుండేవాడు. అదే ప్రాంతానికి చెందిన డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని కూడా ట్రాప్ చేసి, ప్రేమ పేరుతో నయవంచన చేశాడు. ఆపై ఫోనులో కూడా మట్లాడకుండా మానసికంగా వేధించాడు. దాంతో అతనికి విద్యార్థిని వీడియో కాల్ చేసి లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలోనూ అతను కనీసకనికరం చూపలేదు. ఈ సంఘటన అందర్నీ కలిచివేసింది.


విద్యార్థిని మృతదేహాన్ని జీజీహెచ్‌కి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మాయమాటలతో తమ కుమార్తె మోసపోయి, చివరకి తమకి కాకుండా పోయిందంటూ విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


Advertisement
Advertisement
Advertisement