1500 మందికి ‘సెలెక్ట్‌’ ఉపాధి

ABN , First Publish Date - 2022-01-17T08:51:14+05:30 IST

1500 మందికి ‘సెలెక్ట్‌’ ఉపాధి

1500 మందికి ‘సెలెక్ట్‌’ ఉపాధి

మార్చి లోపు 15 మొబైల్‌ స్టోర్లు ప్రారంభం.. సెల్‌కాన్‌ ఎండీ గురు 

గంగాధర నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలో ఇప్పటివరకు 85 సెలెక్ట్‌ మొబైల్‌స్టోర్‌లు ప్రారంభించి 1500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని సెల్‌కాన్‌ మొబైల్‌, సెలెక్ట్‌ మొబైల్‌ స్టోర్సుల ఎండీ యర్రగుంట్ల గురుస్వామినాయుడు పేర్కొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాతపాళ్యం పంచాయతీ మిట్టకొత్తూరు గ్రామానికి విచ్చేసిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. మార్చి నెలాఖరులోపు మరో 15 మొబైల్‌ స్టోర్స్‌ని ప్రారంభించడానికి ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. చిత్తూరు జిల్లాలోనే 12 మొబైల్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. కడపజిల్లాలోని కూపర్తి ఏపీఐఐసీ భూముల్లో తిరుపతి (రేణిగుంట) సెల్‌కాన్‌ మొబైల్‌ కంపెనీకి ఎక్స్‌టెన్షన్‌గా ఆరు ఎకరాల భూమిలో సెల్‌కాన్‌ రెసులేట్‌ ఎలకా్ట్రనిక్స్‌ పేరుతో రూ.50 కోట్ల పెట్టుబడితో, డిజికాన్‌ సొల్యూషన్స్‌ పేరుతో అదే స్థలంలో ఇంకోచోట ఆరు ఎకరాల భూమిలో ఎల్‌ఈడీ టీవీల విడి భాగాల తయారీకి రూ.50 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. దీనికి గత ఏడాది డిసెంబర్‌ 23వ తేదీన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించామన్నారు.  

Updated Date - 2022-01-17T08:51:14+05:30 IST